రంగస్థల పురస్కార అవార్డులకు 65 మంది ఎంపిక : అంబికా కృష్ణ

20:22 - April 16, 2018

విజయవాడ : 2017-18 సంవత్సరం..రంగస్థల పురస్కార అవార్డులకు 65 మందిని ఎంపిక చేసినట్లు ఏపీ రాష్ట్ర ఫిల్మ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ అంబికా కృష్ణ తెలిపారు. కందుకూరి వీరేశలింగం 171వ జయంతి సందర్భంగా ఏప్రిల్‌ 21న ఏలూరులో అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ ఏడాది ఉత్తమ షార్ట్‌ ఫిలిమ్స్‌లకు కూడా అవార్డులు అందజేస్తామని అన్నారు. ఏపీకి స్పెషల్‌ స్టేటస్‌కు మద్దతుగా విజయవాడలో .. త్వరలో సినీ, టీవీ నటీనటులు ర్యాలీ నిర్వహిస్తారని అంబికా కృష్ణ చెప్పారు.  

 

Don't Miss