ఏపీలో ప్రైవేటు వర్సిటీలు..651 ఎకరాలు..

18:31 - November 3, 2017

విజయవాడ : ఏపీలో ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు ఉన్నత విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. అమరావతిలో అమెటీ యూనివర్సిటీకి 90 ఎకరాలు, సవితా యూనివర్సిటీకి 166 ఎకరాలు, విజయనగరంలో సెంచూరియన్ యూనివర్సిటీకి 125 ఎకరాలు, చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలో వెల్‌ టెక్ యూనివర్సిటీకి 50 ఎకరాలు, విశాఖపట్నంలో ప్రపంచ శాంతి యూనివర్సిటీకి 70 ఎకరాలు, అకార్డ్ యూనివర్సిటీకి 150 ఎకరాల చొప్పున భూములను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మంత్రి వర్గ ఉపసంఘం సిఫార్సుల మేరకు ఉన్నత విద్యాశాఖ మొత్తం ఆరు యూనివర్సిటీలకు 651 ఎకరాలను కేటాయించింది. మరోవైపు ప్రభుత్వ యూనివర్సిటీల్లో వసతులు కల్పించకుండా ప్రైవేట్‌ యూనివర్సిటీలకు రెడ్ కార్పెట్ పరుస్తున్నారంటూ విద్యార్ధి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 

Don't Miss