మధు వస్తున్నాడని 144సెక్షన్..పోలీస్ పికెట్..

18:50 - June 19, 2017

ప్రకాశం : జిల్లాలో పరుచూరు మండలం దేవరపల్లికి వెళుతున్న ఏపీ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధును పోలీసులు అరెస్టు చేశారు. బస్సులో వెళుతున్న ఆయన్ను..ఇతర నేతలను మార్గమధ్యంలోనే అరెస్టు చేయడం గమనార్హం. 29 ఎకరాల దళితుల భూముల్లో కొన్ని ఏళ్లుగా పంటలు సాగు చేస్తున్నారు. 'నీరు మీరు -చెట్టు'లో భాగంగా ఈ సాగు భూమిలో చెరువు తవ్వేందుకు అధికారులు ప్రయత్నించారు. దీనిపై హైకోర్టులో గ్రామస్తులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు చట్టపరమైన విధానాలు అవలింబిచాలని అధికారులను ఆదేశించారు. కోర్టు ఆదేశాల అనంతరం మధు గ్రామానికి వెళ్లేందుకు నిర్ణయించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు దేవరపల్లిలో 144 సెక్షన్ ఏర్పాటు..పోలిస్ పికెటింగ్ లను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నేతలను రాత్రికి రాత్రి అరెస్టు చేయగా మధుతో పాటు గ్రామానికి చెందిన గ్రామానికి వస్తున్న హనుమంతరావు, ఆంజనేయులను అన్నంబొట్టువారిపాలెం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని మార్టూరు పీఎస్ కు తరలించారు. పోలీసుల తీరును మధు తీవ్రంగా తప్పుబట్టారు. దారి మధ్యలోనే చుట్టుపక్కల పది చెక్ పోస్టులు ఏర్పాటు చేసి కార్యకర్తలను..అరెస్టు చేయడం జరిగిందన్నారు. దేవరపల్లిలో మీటింగ్ పెట్టి తీరుతామని..ఎలా అడ్డుకుంటారో చూస్తామని పేర్కొన్నారు. దళితులపై జరుగుతున్న అన్యాయాలను ఎండగడుతాం అని తెలిపారు.

Don't Miss