జన్మభూమి కమిటీలను రద్దు చేయాలి : బాబురావు

08:44 - January 9, 2018

జన్మభూమి కమిటీలను రద్దు చేయాలని సీపీఎం ఏపీ రాష్ట్ర నాయకులు బాబురావు అన్నారు. జన్మభూమి కమిటీలు రాజ్యాంగ విరుద్ధమైన, చట్ట విరుద్ధమైన కమిటీలని మండిపడ్డారు. ఇదే అంశంపై నిర్వహించిన జనపథం చర్చా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ నేతలు అరాచకం సృష్టిస్తున్నారని విమర్శించారు. జన్మభూమి కమిటీలు పెత్తనం చెలయిస్తున్నాయని పేర్కొన్నారు. చిత్తశుద్ధితో జన్మభూమి సభలను నిర్వహించాలన్నారు. 'జన్మభూమి సభలు ప్రజా సమస్యలపై చర్చిస్తున్నాయా? లేక అధికార పార్టీ సభల్లా మారాయా? పింఛన్లు, రేషన్‌కార్డులు, రుణమాఫీ, ఇళ్ల స్థలాలు తదితర సమస్యలపై  చర్చ జరుగుతుందా? అసలు జన్మభూమి సభలో ప్రజా సంఘాలు ఆందోళన ఎందుకు చేస్తున్నాయి? ఇలాంటి తదితర అంశాలపై బాబురావు మాట్లాడారు. ఆ వివరాలను వీడియోలో చూద్దాం... 

 

Don't Miss