ప్రజాశక్తికి ప్రజలు అమోఘమైన మద్దతు : మధు

13:53 - January 9, 2018

గుంటూరు : ప్రజాశక్తికి ప్రజలు అమోఘమైన మద్దతు ఇచ్చారని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. తాడేపల్లిలో ప్రజాశక్తి పత్రిక ఏపీ రాష్ట్ర కార్యాలయం శంకుస్థాపన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్ర విజభన సమయంలో, ఏపీ ఏర్పడిన తర్వాత ప్రజాశక్తి పత్రికకు చాలా ఒడిదుడులు, ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు. ప్రజాశక్తి పత్రికకు ప్రజలు గొప్ప మద్దతు ఇచ్చారని పేర్కొన్నారు. పత్రిక సిబ్బంది మూల స్థంబాలుగా నిలబడ్డారని కొనియాడారు. రాష్ట్ర కేంద్ర కార్యాలయం లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొందన్నారు. పత్రిక మరో అడుగు ముందుకు వేయాలని కోరుకున్నారు. వీలైనంత తొందరగా యాజమాన్యం భవన నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నారు. 1942 నుంచి ప్రజాశక్తి అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని, నిలబడిందని తెలిపారు.

 

Don't Miss