మేనకగాంధీని కలిసిన ఏపీ స్పీకర్ కోడెల

13:42 - January 10, 2017

ఢిల్లీ : కేంద్ర మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి మేనకగాంధీని ఏపీ శాసనసభ స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ కలిశారు. ఫిబ్రవరి 10,11,12 తేదీల్లో విజయవాడలో జరిగే మహిళా పార్లమెంటేరియన్‌ సమావేశాలకు హాజరుకావాలని కేంద్రమంత్రిని స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు ఆహ్వానించారు. ఏపీలో సదస్సు ఏర్పాటుపై హర్షం వ్యక్తం చేసిన కేంద్ర మంత్రి మేనకగాంధీ..యూపీలో ఎన్నికలు ఉన్నందున వల్ల తాను సదస్సుకు హాజరుకాలేనని.. స్పీకర్‌కు వివరించారు. ఏపీలో జరిగే ఈ సమావేశాలకు వివిద దేశాల నుంచి సుమారు 12వేల మంది మహిళా ప్రతినిధులు హాజరవుతున్నారని స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు తెలిపారు. 

 

Don't Miss