ప.గో, కడప, గుంటూరులో బంద్...

06:44 - April 16, 2018

విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ రాష్ర్టానికి ప్రత్యేక హోదా సాధనకోసం చేపడుతున్న బంద్‌కు మద్ధతుగా నెల్లూరులో సీపీఎం, సీపీఐ పార్టీలు బంద్‌లో పాల్గొన్నాయి. తెల్లవారుజామున నాలుగు గంటలనుంచే.. ఆర్టీసీ బస్టాండ్‌ వద్దకు చేరుకున్న వామపక్ష పార్టీల నాయకులు బస్సులను నిలిపేశారు. బంద్‌ను విజయవంతం చేసేందుకు ఎక్కడి బస్సులను అక్కడే అడ్డుకున్నారు.

పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో బంద్‌ కొనసాగుతోంది. ప్రత్యేక హోదా సాధన కోరుతూ ప్రత్యేక హోదా సాధన సమితి బంద్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ బంద్ కు వైసీపీ, కాంగ్రెస్, జనసేన, వామపక్ష నేతలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి.

కడప జిల్లాలో ఆర్టీసీ బస్టాండు వద్ద విపక్ష నేతలు ధర్నాలు నిర్వహిస్తున్నారు. ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనంటూ డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు.

గుంటూరు జిల్లాలో ఎక్కడికక్కడ బంద్ కొనసాగుతోంది. విపక్ష నేతలు పలు ప్రాంతాల్లో ఆందోళనలు చేపట్టాయి. ఉదయం 5.30 గంటల నుండే ఆర్టీసీ బస్టాండుల వద్ద నేతలు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. దీనితో బస్సులు ఎక్కడికక్కడనే నిలిచిపోయాయి. 

Don't Miss