లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్ కార్యాలయంలో ఆప్‌ ప్రభుత్వం ఆందోళన

08:34 - June 13, 2018

ఢిల్లీ : ఆప్‌ ప్రభుత్వం డిమాండ్లను లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్ అనిల్‌ బైజాల్‌ తోసిపుచ్చడాన్ని నిరసిస్తూ సిఎం కేజ్రీవాల్‌తో పాటు మంత్రులంతా నిరసన చేపట్టారు. గత 18 గంటలకు పైగా ఎల్జీ వెయిటింగ్‌ రూములోనే బైఠాయించారు. నాలుగు నెలలుగా కొనసాగుతున్న ఐఏఎస్‌ అధికారుల సమ్మెను ఎల్జీ విరమింపజేయకపోవడంతో ఢిల్లీలో పాలన స్తంభించిందని కేజ్రీవాల్‌ ఆరోపిస్తున్నారు. ఐఏఎస్‌ అధికారులపై విచారణతో పాటు మూడు ప్రతిపాదనలను ఎల్జీ తిరస్కరించడంతో వేరే మార్గం లేక ఆందోళన బాట పట్టామని డిప్యూటి సిఎం మనీష్‌ సిసోడియా ట్వీట్‌ చేశారు. తమ డిమాండ్ల సాధన కోసం మంత్రి సత్యేంద్ర జైన్‌ నిరవధిక నిరాహార దీక్షను ప్రారంభించారని ఆయన  పేర్కొన్నారు. మరోవైపు ఎల్జీకి వ్యతిరేకంగా సిఎం కేజ్రీవాల్‌ ఇంటి ఎదుట ధర్నాకు రంగం సిద్ధం చేశారు. ఎల్జీ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 

 

Don't Miss