ఫ్లాపైనా డబ్బులొస్తాయి - అర్షద్ వార్సి...

11:12 - October 11, 2017

'గోల్ మాల్'..బాలీవుడ్ లో వచ్చిన ఈ సినిమా నవ్వులు కురిపించింది. 'గోల్ మాల్' సిరీస్ లో ఏకంగా మూడు సినిమాలు వచ్చాయి. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడంతో సినిమాలు విజయవంతమయ్యాయి. 'గోల్ మాల్ ఏగైన్' తో మళ్లీ ప్రేక్షకుల ముందుకు చిత్ర బృందం రాబోతోంది. షూటింగ్ పూర్తి చేసుకుని పోస్టు ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకొంటోంది. ప్రచార కార్యక్రమాల్లో ఆయా హీరోలు పాల్గొంటున్నారు.

ప్రచార కార్యక్రమలో భాగంగా నటుడు 'అర్షద్ వార్సి' పాల్గొన్నారు. ఈయన ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసింది. సినిమా పరాజయం చెందినా రూ. 200 కోట్లు రాబడుతుందని జోస్యం చెప్పాడు. చిత్రాలు రిలీజ్ అయిన సమయంలో విజయం సాధిస్తుందా ? లేదా ? అనే భయం ఉంటుంది..కానీ 'గోల్ మాల్' విషయంలో అలాంటేది ఏమీ లేదన్నారు. సినిమా ట్రైలర్ ప్రేక్షకులకు బాగా నచ్చిందని తెలిపారు.

బాలీవుడ్‌ నటులు అజయ్‌ దేవగణ్‌, పరిణీతి చోప్రా ప్రధాన పాత్రల్లో నటిస్తుండబగా టబు రుక్మిణిగా, ప్రకాశ్‌ రాజ్‌ షేరు భాయ్‌ పాత్రల్లో నటిస్తున్నారు. రోహిత్‌ శెట్టి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అక్టోబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఇప్పటికే మూడుసార్లు మురిపించిన 'గోల్‌మాల్' సిరీస్ నాలుగో సారి కూడా నవ్వులు కురిపిస్తారేమో చూడాలి. 

Don't Miss