'అన్నపూర్ణ' ఇంట్లో తీవ్ర విషాదం...

15:09 - July 28, 2018

హైదరాబాద్ : టాలీవుడ్ సీనియర్ నటి 'అన్నపూర్ణ' నివాసంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఆమె కుమార్తె ఆత్మహత్యకు పాల్పడింది. కీర్తి ఫ్యాన్ కు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. శ్రీనగర్ కాలనీలో ఓ అపార్ట్ మెంట్ లో అన్నపూర్ణ నివాసం ఉంటోంది. శనివారం ఉదయం ఎంతకు తలుపులు తెరవకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు తలుపులు తెరిచారు. గదిలో ఫ్యాన్ కు చున్నీతో ఉరి వేసుకుని విగతజీవిగా కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కీర్తి సెల్ ఫోన్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఆమె మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. బెంగళూరుకు చెందిన ఓ యువకుడితో 'కీర్తి' వివాహం జరిగింది. గత కొంత కాలంగా హైదరాబాద్ లోనే ఉంటోందని తెలుస్తోంది. 
కానీ కీర్తి ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలియరావడం లేదు. ఆమె కుమార్తెకు మాటలు రాకపోవడం..గత కొన్ని రోజులుగా డిప్రెషన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని వార్తలు వెలువడుతున్నాయి. ఆత్మహత్య నేపథ్యంలో సూసైడ్ నోట్ రాసిందా ? అనేది తెలియరావడం లేదు. మరిన్ని వివరాలు రానున్న రోజుల్లో తెలియనున్నాయి. 

Don't Miss