బిగ్ బాస్ 2లో 'హెబ్బా' వైల్డ్‌కార్డ్ ఎంట్రీ?!..

15:24 - July 12, 2018

తెలుగులో బిగ్ బాస్ 2ఇప్పుడిప్పుడే ముదిరి పాకాన పడుతోంది. కొంతమంది సభ్యుల మధ్య వుండే గ్రూప్స్ ను సున్నితంగానే కాకుండా సూటిగా బిగ్ నిర్వాహకులు విడదీసి వారిలో వారికే పోటీలు,టార్గెట్ లు పెట్టి వాతావరణాన్ని వేడెక్కిస్తున్నారు. బిగ్‌బాస్ మొద‌టి సీజ‌న్ హిట్ కావ‌డంతో బిగ్‌బాస్ రెండో సీజ‌న్ భారీ అంచనాల మ‌ధ్య మొద‌లైంది. సీజన్ 1కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పెషల్ అట్రాక్షన్ అయితే.. సీజన్ 2కి నేచురల్ స్టార్ నాని అట్రాక్షన్. కానీ ఎన్టీఆర్ ఆకట్టుకున్నంతగా నాని ఆకట్టుకోలేకపోతున్నారని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కానీ ఎన్టీఆర్ బిగ్ బాస్ సభ్యులను అలరించేలా వ్యాఖ్యానిస్తే..నాని మాత్రం షో జరిగే పరిణామాలను..ఆ సందర్భాలను విశ్లేషిస్తు సభ్యుల వివరణలు కోరుతున్నాడు. ఆ సమయంలో సభ్యులు కొంచెం ఎమోషన్ గా మాట్లాడుతున్న సందర్భంగా నాని వాటిని సున్నితంగా కట్ చేస్తునే..పదునుగా మాట్లాడుతు..సమాధానాలు వారి ద్వారానే చెప్పిస్తుంటం విశేషం. దీన్ని పెద్ద గమనించిన పలువురు నాని ఎన్టీఆర్ లా యాంకరింగ్ చేయలేకపోతున్నాడనే వాదనలు వినిపిస్తున్నాయి.

ఈ షోలో సెలబ్రిటీస్ ఎవ‌రూ పెద్దగా ఫేమ‌స్ కాక‌పోవ‌డంతో పెద్దగా ఆక‌ట్టుకోవ‌డం లేదనే వాదన కూడా వినిపిస్తోంది. దీనికితోడు హోస్‌మెట్స్ మ‌ధ్య జరుగుతున్న అర్థం పర్థం లేని తగాదాలు..సాగదీత ధోరణులు ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తున్నాయని టాక్. దీంతో షోకి సీజన్ 1కి వచ్చినంత రేటింగ్ రావట్లేదని తెలుస్తోంది.

దీంతో ఎలాగైనా మంచి రేటింగ్స్‌తో ఈ షోను ముందుకు తీసుకెళ్లాలని బిగ్‌బాస్ టీం భావిస్తోందట. దీనిలో భాగంగానే షోలోకి వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా ఓ యువ హీరోయిన్‌ని తీసుకురాల‌ని బిగ్‌బాస్ టీం ఆలోచనగా తెలుస్తోంది. ఇప్పటికే వైల్డ్‌కార్డు ద్వారా నందిని ఎంట్రీ ఇచ్చింది. అయితే నందిని వ‌ల్ల షోకి పెద్దగా ఉప‌యోగం లేదు. ఎందుకంటే నందిని అనుకున్నంతగా మసాలా దట్టించలేకపోతోంది. దీనికి కారణం ఆమె సాఫ్ట్ నేచర్ ధోరణి కావచ్చు. దీంతో కుమారి 21 ఎఫ్ సినిమాలో రాజ్ తరుణ్ సరసన నటించి యూత్‌కి నిద్ర పట్టకుండా చేసిన హెబ్బా ప‌టేల్‌ని ఈ షోలోకి వైల్డ్‌కార్డ్ ద్వారా తీసుకురావడానికి ప్రయ‌త్నాలు జరుగుతున్నాయని సమాచారం. కానీ ఆమె అంగీకరించిందా.. లేదా? అన్నది తెలియడం లేదు. ఈ వీకెండ్‌లో ఈ విషయమై ఒక క్లారిటీ వచ్చే అవకాశముందని తెలుస్తోంది.

Don't Miss