బంగారు బోనమెత్తిన 'రాములమ్మ'...

13:29 - August 5, 2018

హైదరాబాద్ : లాల్ దర్వాజ బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. కొద్దసేపటి క్రితం మహంకాళి అమ్మవారికి మాజీ ఎంపీ, సినీనటి విజయసాంతి బంగారు బోనం సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...తెలంగాణ రాష్ట్రం వస్తే అమ్మవారికి బంగారు బోనం సమర్పిస్తానని మొక్కుకున్నానని తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు.

2014 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటి చేసి ఓడిపోయిన ఆమె ఇప్పటి వరకు ఎలాంటి రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. కానీ ఈ మధ్యే కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీని కలవడంతో ఆమె కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరిగింది. తాజాగా ఈనెల 13, 14 తేదీల్లో తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. రాహుల్ పర్యటనలో ఆమె పాల్గొనే అవకాశం ఉందని మళ్లీ ప్రచారం జరుగుతోంది. 

Don't Miss