క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొన్నా.. ఆ వలలో పడొద్దు..

10:30 - July 31, 2018

'సమ్మోహనం' సినిమాతో తెలుగు ప్రేక్షకులను సమ్మోహనంలో పడవేసిన అద్భుతమైన నటి అదితి రావు హైదరి. తల్లి, తండ్రి ఇంటి పేర్లను తన పేరుతో జతకలిపి ప్రేక్షకులను తన నటనతో అలరిస్తున్న నటి అదితీరావు హైదరి. గత కొన్ని నెలలుగా చిత్ర పరిశ్రమను కుదిపివేస్తున్న ' క్యాస్టింగ్ కౌచ్ ' అనే మాట ఎంతగా సంచలనం సృష్టించిందో తెలియనిది కాదు. ఈ క్రమంలో అదితి బాలీవుడ్‌లో కుదురుకునేందుకు పడిన కష్టాలను ఏకరవు పెట్టింది. తాను కూడా క్యాస్టింగ్ కౌచ్ బాధితురాలినేనని ఆవేదన వ్యక్తం చేసింది. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అదితి మాట్లాడుతూ, చిత్ర పరిశ్రమలో ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నానని..అయితే వాటన్నింటినీ అధిగమించి కుదురుకుంటున్నాని తెలిపింది. చిత్ర పరిశ్రమలో అమ్మాయిలను ఎలా చూస్తారో తెలిసి చాలాసార్లు ఏడ్చానని తెలిపింది. క్యాస్టింగ్ కౌచ్‌కు నో చెప్పినందుకు కొన్ని నెలలపాటు తనకు అవకాశాలు లేకుండా పోయాయని ఆవేదన వ్యక్తం చేసింది.

క్యాస్టింగ్ కౌచ్ వలలో పడొద్దు : అదితీ రావు
క్యాస్టింగ్ కౌచ్ గురించి తనతో మాట్లాడడానికి వారికెంత ధైర్యం అనుకునే దానినని..దాంతో దాదాపు 8 నెలలుపాటు ఖాళీగా ఉన్నట్టు చెప్పింది. చేతిలో ఏ సినిమా లేకున్నా తాను తీసుకున్న నిర్ణయం తనను మరింత బలంగా తయారుచేసిందని ఆత్మవిశ్వాసంతో చెప్పింది. సినీ పరిశ్రమలో పవర్ ప్లే నడుస్తుంటుందని..ఆ వలలో అమ్మాయిలు పడకూడదని హెచ్చరించింది. నిజంగా మనలో సత్తా ఉంటే అవకాశాలు వాటంతట అవే వెతుక్కుంటూ వస్తాయని ధీమా వ్యక్తంచేసింది ఈ సమ్మెనం అందాల సుందరి. 

Don't Miss