చదువులో రాణిస్తున్న అఫ్జల్ తనయుడు..

19:56 - January 11, 2018

ఢిల్లీ : పార్లమెంట్‌పై దాడి కేసులో మరణశిక్షకు గురైన అఫ్జల్‌గురు తనయుడు గాలిబ్ గురు చదువులో రాణిస్తున్నాడు. బోర్డ్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ నిర్వహించిన 12వ తరగతి పరీక్షల్లో డిస్టింక్షన్‌లో పాసయ్యాడు. ఈ ఏడాది నవంబర్‌లో నిర్వహించిన 12వ తరగతి పరీక్షల్లో గాలిబ్‌ 88 శాతంతో 441 మార్కులు సాధించాడు. 2001లో పార్లమెంట్‌పై దాడి చేసిన కేసులో దోషిగా తేలిన అఫ్జల్ గురుకు 2013లో ఉరిశిక్ష విధించిన విషయం తెలిసిందే. గాలిబ్ గురు పదో తరగతిలో కూడా 95 శాతం మార్కులు సాధించాడు. సోషల్ మీడియాలో గాలిబ్ గురుపై ప్రశంసల వర్షం కురుస్తోంది. బారాముల్లా జిల్లాలోని సోపూర్ పట్టణంలోని గల వీరి నివాసం సందడిగా మారింది. స్నేహితులు, కుటుంబ సభ్యులు గాలిబ్‌ గురుకు అభినందనలు తెలిపారు. 

Don't Miss