పటాన్‌చెరులో భారీ అగ్నిప్రమాదం

12:05 - April 24, 2018

సంగారెడ్డి : పటాన్‌చెరు పారిశ్రామకవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. స్థానిక అగర్వాల్‌ రబ్బరు పరిశ్రమలో మంటలు ఎగిసిపడుతున్నాయి. పేలుడు శబ్దాలతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది. కిలోమీటరు మేర దట్టమైన పొగలు వ్యాపించాయి. స్థానికులు భయాందోళనలో ఉన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. 

Don't Miss