గల్ఫ్ లో తెలంగాణ యువకుడి అవస్థలు
17:16 - September 11, 2017
హైదరాబాద్ : ఏజెంట్ల మోసాలతో మరో యువకుడు గల్ఫ్ దేశంలో అవస్థలు పడుతున్నాడు. ఉపాధి లేక మరోవైపు అక్కడినుండి హైదరాబాద్‌కు వచ్చేందుకు డబ్బులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నాడు. తన కుమారుడిని ఎలాగైనా స్వస్థలానికి చేర్చాలని... గల్ఫ్ తెలంగాణ వెల్ఫేర్ అసోసియేషన్ కల్చరల్ అధ్యక్షుడు పోతుకూరి బసంత్ రెడ్డిని కలిసి వృద్ధ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. తన కుమారుడు శ్రావణ్‌ను నిజామాబాద్‌కు చెందిన ఏజెంట్లు లక్ష్మణ్, ప్రతాప్గౌడ్లు మోసం చేశారని తెలిపింది. తనకు ఎవరూ లేకపోవడంతో మేడ్చల్ జిల్లా కుషాయిగూడలోని తమ బందువుల దగ్గర ఉన్నానని వాపోయింది.