ఏపీలో అజ్ఞాతవాసి అదునపు షోలు

07:46 - January 7, 2018

గుంటూరు : పవన్‌ కల్యాణ్‌ నటించిన అజ్ఞాతవాసి సినిమా అదనపు షోల ప్రదర్శనకు ఏపీ ప్రభుత్వం అనుమతిచ్చింది. ఈనెల 10న ప్రపంచ వ్యాప్తంగా అజ్ఞాతవాసి విడుదలకానుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలవుతోన్న ఈ సినిమాకు... రోజూ ఏడు ఆటల ప్రదర్శనకు నిర్మాతలు ఏపీ ప్రభుత్వాన్ని అనుమతి కోరారు. ప్రతి రోజూ ఉదయం పది నుంచి రాత్రి 12 గంటల వరకు నాలుగు ఆటలు ప్రదర్శించే అనుమతి ఉంది. పవన్‌ సినిమాకు ప్రేక్షకుల్లో ఉన్న ఆత్రుతను దృష్టిలో పెట్టుకుని రాత్రి ఒంటిగంట నుంచి ఉదయం పదిగంటల వరకు మరో మూడు అదనపు షోలకు అనుమతి ఇవ్వాలని నిర్మాతలు చేసిన విజ్ఞప్తిపై ఏపీ ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఆడించే నాలుగు ఆటలతో ఈ మూడు ఆటలు కలిపితే రోజుకు ఏడు షోల చొప్పున ఎనిమిది రోజులపాటు ప్రదర్శనకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో రిలీజైన అన్ని థియేటర్లలోనూ 24 గంటలూ సినిమా ప్రదర్శించేందుకు మార్గం సుగమమైంది. 

Don't Miss