'పేదవాని మాంసం' చిక్కుడు కాయ

10:06 - January 9, 2017

ఈ కాలంలో విరివిగ కాసే కాయలు చిక్కుళ్లు. గ్రామసీమల్లో ప్రతి ఇంటి పెరట్లో చిక్కుడు పాదు కనువిందు చేస్తుంటుంది. చిక్కుడుకాయల్లో మంచి పోషకాలు ఉన్నట్లు న్యూట్రిషన్లు చెబుతుంటారు. చిక్కుడు కాయలతో చేసే ప్రతివంటకం అత్యంత రుచికరంగా ఉండి శరీరానికి కావల్సిన వివిధ పోషకాలను పుష్కలంగా అందిస్తాయి. అందుకే చిక్కుడు కాయల్ని 'పేదవాని మాంసం'గా అభివర్ణిస్తుంటారు. ఇప్పుడు సంవత్సరం పొడువునా కొన్ని రకాల చుక్కుడు కాయలు కాస్తూనే ఉన్నాయి. పండించే నేలతీరూ నీరూ విత్తనాలను బట్టి చిక్కుడుకాయల్లో రకాలకూ కొదవలేదు. గింజ తక్కువగా ఉండే తప్పరకం, ఎరుపు రంగు గింజలతో కనిపించే డిక్సీ, గింజ ఎక్కువగా ఉండే కణుపు చిక్కుడు రకాలతోబాటు సన్నగా పొడవుగానూ, పొట్టిగా వెడల్పుగా ఉండే రకాలు కూడా ఉంటాయి. అదే చిక్కుడు... అలాగే ఆకుపచ్చరంగుతో బాటు వంకాయ వర్ణంతో కలిసిన ఆకుపచ్చా, ముదురు వంకాయ వర్ణమూ, ఎరుపూ, ముదురు గులాబీ... ఇలా విభిన్న రంగుల్లో కాసే రకాలూ ఉన్నాయి. ఈ కాయల్నీ గింజల్నీ అన్ని ప్రాంతాల్లోనూ వంటల్లో విరివిగా వాడుతుంటారు. మనదగ్గర వీటిని వేయించీ ఉడికించీ లేదా టొమాటో, వంకాయ... వంటి ఇతర కూరగాయలతో కలిపి అనేక రకాల కూరలు వండుతుంటారు. కానీ చిక్కుడు గింజల్ని పచ్చిగా మాత్రం తినకూడదు. ఎందుకంటే వీటిల్లో ట్రిప్సిన్‌, సైనోజెనిక్‌ గ్లైకోసైడ్‌ అనే హానికరమైన పదార్థాలు ఉంటాయి. అదే ఉడికించినప్పుడయితే వాటిల్లోని హానికర పదార్థాలు పూర్తిగా నశించిపోతాయి. సో విరివిగా దొరికే చిక్కుడు కాయల్ని ప్రతిరోజూ వంటకాల్లో చేర్చుకుందాం.

Don't Miss