మళ్లీ మేకప్ వేసుకోనున్న 'అంబరీష్'..

10:58 - October 9, 2017

అంబరీష్..కన్నడ సినిమా నటుడు. అంతేగాకుండా రాజకీయ నాయకుడు కూడా. ఇతను కన్నడ భాషా చిత్రాలతో పాటు తమిళం, హిందీ చిత్రాలలో కూడా నటించాడు. ఆయన నటించిన పలు సినిమాలకు అవార్డులు సైతం వచ్చాయి. కన్నడలో అంబరీష్ టాప్ హీరోగా పేరు సంపాదించుకున్నారు. సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా రాణించారు. ఇప్పుడు సినిమాల వైపు దృష్టి మళ్లింది. ఆయన హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. తెలుగులో 'ఈగ' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన 'కిచ్చ సుదీప్' ఈ సినిమాకు నిర్మాతగా, నంద కిషోర్ దర్శకత్వం వ్యవహరిస్తున్నారు. 'అంబి నింగే మయసాయ్తే' టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమాలో హీరోయిన్ గా 'సుహాసిని'ని ఎంపిక చేసినట్లు టాక్. ఇటీవలె అంబరీష్‌ తన కుమారుడు అభిషేక్‌గౌడ్‌ను కన్నడ చిత్రరంగానికి పరిచయం చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం 'అంబరీష్‌' 'కురుక్షేత్రం'లో నటిస్తున్నారు. భీష్ముడు పాత్రలో ఆయన నటిస్తున్నట్లు తెలుస్తోంది. 

Don't Miss