'రోబో రజనీ'తో అమీ జాక్సన్ షూటింగ్...

11:03 - October 11, 2017

'శంకర్' దర్శకత్వంలో ఓ చిత్రం వస్తుందంటే ఆ సినిమాపై భారీ అంచనాలు నెలకొని ఉంటాయి. అత్యంత భారీ బడ్జెట్ తో 'శంకర్' సినిమాలు నిర్మిస్తుంటాడు. గతంలో ఆయన నిర్మించిన చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 'రజనీకాంత్' 'ఐశ్వర్య రాయ్' కాంబినేషన్ లో 'రోబో' వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం ఘన విజయం సాధించింది. అనంతరం దీనికి సీక్వెల్ గా 'రోబో 2' సినిమాను 'శంకర్' అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్టులో 'అమీ జాక్సన్' ప్రధాన పాత్ర పోషిస్తోంది. తాజాగా అమీ జాక్సన్ పై వచ్చే సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఇందులో 'రోబో రజనీ'తో జరిగే షూటింగ్ లో 'అమీ' పాల్గొననున్నారు. ఈ సందర్భంగా 'శంకర్' కార్యాలయంలో ఏర్పాటు చేసిన 'రోబో రజినీ' తో 'అమీ జాక్సన్' ఫొటో దిగింది. రేపటి నుంచి 'రోబో రజినీ'తో షూటింగ్ అంటూ క్యాప్సన్ పెట్టి..'అమీ జాక్సన్' ఫొటోను షేర్ చేసింది.

తెలుగు.. తమిళ.. హిందీ భాషల్లో ఒకేసారి ఈ సినిమాను విడుదల చేయనున్నారు. మూడు భాషల్లో ఒకేసారి డబ్బింగ్ పనులు నిర్వహించారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. లైకా ప్రొడక్షన్స్ దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తోంది. సూప‌ర్ స్టార్ రజనీ కాంత్ తో పాటు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ .. అమీ జాక్సన్ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు.

Don't Miss