పాపం..అమీర్ కు బహుమతులివ్వదేంట..

15:41 - March 15, 2017

అమీర్ ఖాన్..బాలీవుడ్ మిస్టర్ ఫర్ ఫెక్ట్ గా పేరొందారు. వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ అలరిస్తున్న ఈ హీరో ఇటీవలే బర్త్ డే జరుపుకున్నారు. 52వ పుట్టిన రోజును మంగళవారం ఘనంగా జరుపుకున్నారు. ముంబైలో తన నివాసంలో కేక్ కట్ చేసిన అనంతరం మీడియాతో సరదాగా మాట్లాడారు. సోమవారం రాత్రి 12గంటలకే నిద్రపోవడం జరిగిందని, ఆ సమయంలో ఎన్నో ఫోన్స్ కాల్స్, సందేశాలు వచ్చాయన్నారు. కానీ ఒక్కరు కూడా తనకు పుట్టిన రోజు బహుమతులివ్వలేదని..కనీసం మీరైనా ఇస్తారని ఆశిస్తున్నట్లు మీడియానుద్దేవించి సరదాగా వ్యాఖ్యానించారు. ఇంట్లో ఏర్పాటు చేసిన గెట్ టు గెదర్ పార్టీకి రావాలని రెండు రోజుల క్రితమే 'షారూఖ్ ఖాన్'ని ఫోన్ లో ఆహ్వానించినట్లు, తమ మధ్య వృత్తిపరమైన విషయాలను చర్చించుకోవడం జరగదన్నారు. గతేడాది 'దంగల్‌' సినిమాతో కలెక్షన్ల రికార్డులు సృష్టించిన ఈ మిస్టర్ ఫర్ ఫెక్ట్ ప్రస్తుతం 'సీక్రెట్‌ సూపర్‌స్టార్‌', 'థగ్స్‌ ఆఫ్‌ హిందూస్థాన్‌' చిత్రాల్లో నటిస్తున్నారు.

Don't Miss