చంద్రబాబు డైరెక్షన్ లోనే దాడి యాక్షన్ : సోము

16:24 - May 12, 2018

విజయవాడ : నిన్న తిరుపతిలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా కాన్వాయ్‌పై దాడి ఘటనను ఏపీ బీజేపీ నేత సోము వీర్రాజు తీవ్రంగా ఖండించారు. జాతీయ అధ్యక్షుడిపైనే దాడి జరిగితే రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు డైరెక్టన్ లోనే దాడి యాక్షన్ జరిగిందని ఆరోపించారు. అమిత్‌ షా కాన్వాయ్‌పై దాడి కేవలం ప్రభుత్వం వైఫల్యం కారణమన్నారు. ప్రత్యేక హోదాకు నిధులు కేటాయిస్తుంటే తీసుకోకుండా ఉద్యమాలు చేయడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందని విమర్శించారు. ప్రధాని మోదీపై ఎమ్మెల్యే బాలకృష్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారని ఆయనపై ఇంత వరకు ఒక్క కేసు కూడా వేయలేదన్నారు. అలిపిరి ఘటనకు ప్రభుత్వ వైఫల్యమే కారణమని ఆరోపించారు. నిరసన తెలిపే నైతిక హక్కు టీడీపీ కి లేదనీ..అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? అనే సందేహం వస్తోందన్నారు. ఎన్టీఆర్‌ మీదే చెప్పులు విసిరిన సంస్కృతి టీడీపీదని ఎద్దేవా చేశౄరు. హోదాతో ప్యాకేజీకి మించిన న్యాయం జరుగుతుందా? అని ప్రశ్నించారు. అలిపిరి ఘటనపై సీఎం చంద్రబాబు క్షమాపణలు చెప్పాలని సోమువీర్రాజు డిమాండ్ చేశారు. 

Don't Miss