బర్త్ డే..దీపావళికి 'బిగ్ బి' దూరం..

09:43 - October 9, 2017

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఈసారి బర్త్ డే వేడుకలు జరుకోవడం లేదంట. అలాగే దీపావళి పండుగకు కూడా దూరంగా ఉండనున్నారంట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. బిగ్ బి బర్త్ డే అనగానే ఎంతో మంది అభిమానులు ఆయనకు శుభాకాంక్షలు తెలియచేయడానికి ఆయన ఇంటికి క్యూ కడుతారు. సామాజిక మాధ్యమాల ద్వారా విషెస్ తెలియచేస్తారు. బిగ్ బి..బాలీవుడ్ లో యంగ్ హీరోలకు ధీటుగా సినిమాలు చేస్తున్నారు. ఈనెల 11వ తేదీన ఆయన పుట్టిన రోజు. 75వ పడిలోకి అడుగు పెట్టబోతున్నారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 11వ తేదీన ఆయన ఇంటిలో సందడి వాతావరణం నెలకొంటుంది. వేలాదిగా విచ్చేసిన అభిమానులకు ఆయన ధన్యవాదాలు తెలియచేస్తారు.

కానీ ఈసారి బర్త్ డే వేడుకలకు దూరంగా ఉండనున్నట్లు ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్ కు షేర్ చేశారు. 'ఈ సారి బర్త్ డేతో పాటు దీపావళి వేడుకలకు దూరంగా ఉంటున్నా. ఆ టైంలో నేను ముంబైలో కూడా ఉండకపోవచ్చు'. అంటూ ట్వీట్ చేశారు. ఇందుకు గల కారణాలు మాత్రం తెలియరావడం లేదు. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ 'థగ్స్ ఆఫ్ హిందుస్తాన్' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో 'అమీర్ ఖాన్' హీరోగా నటిస్తున్నారు. ఇక యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లో తెరకెక్కనున్న చిత్రంలో కూడా నటిస్తారని తెలుస్తోంది. 

Don't Miss