అనగనగా ఒక దుర్గ మూవీ రివ్యూ

21:22 - October 27, 2017

ఆడవారిపై జరుగుతున్న అన్యాయాలను ఖండిస్తూ, స్త్రీ చైతన్యం ముఖ్యమని చెప్పడానికి తీసిన సినిమా ‘అనగనగా ఒక దుర్గ’దర్శకుడు ప్రకాష్ పులిజాల,నిర్మాత గడ్డంపల్లి రవీందర్ రెడ్డి నూతన నటినటులతో రూపొందించిన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా వుందో ఇప్పుడు చుద్దాం.
కధ విషయానికొస్తే...
ఆడపిల్ల పుట్టిందని పురిట్లోనే చెరువులో పడేస్తాడు దుర్గ (ప్రియాంక నాయుడు) తండ్రి. మృత్యుంజయురాలై తిరిగొస్తుంది దుర్గ. పాప పెద్దయ్య (మేకా రామకృష్ణ) బాలికను కాపాడి ఇంటికి చేరుస్తాడు. తండ్రి నుంచే వివక్ష ఎదుర్కొన్న దుర్గ పెరిగి పెద్దదువుతుంది. ఆమె యవ్వనంలో అడుగుపెట్టేప్పటికి ఆంక్షలు మొదలవుతాయి. బయటకు వెళ్లడం, సరదాగా స్నేహితులతో ఆటలాడటం వద్దంటాడు తండ్రి. ఇంతతో ఊరి పెద్ద రావూజీ (కాళీచరణ్ సంజయ్) కన్నుదుర్గపై పడుతుంది. రావూజీ స్త్రీ లోలుడు. ఊరిలో కనిపించిన ప్రతి అమ్మాయినీ బలవంతంగా అనుభవిస్తుంటాడు. తమను పరుగు పందెంలో ఓడించిందన్న కోపంతో రావూజీ మనుషులు దుర్గను గ్యాంగ్ రేప్ చేస్తారు. పంచాయితీ పెద్దలే రావుజీ తొత్తులే కాబట్టి దుర్గదే తప్పని తీర్పిస్తారు. ఇలాంటి దుర్మార్గుల్ని దుర్గ ఎలా ఎదుర్కొందన్నది మిగిలిన కథాంశం
నటినటుల విషయానికొస్తే ....
దుర్గ పాత్రలో ప్రియాంక పెర్ఫార్మెన్స్ బాగుంది. మొదట్లో సరదాగా ఉండే యువతిగా, తర్వాత తిరగబడే శక్తిలా తన అభినయంతో ఆకట్టుకుంది. దుర్గ పాత్రకు అన్ని విధాలా న్యాయం చేసింది. క్రాంతి పాత్రలో క్రాంతి కుమార్, రావూజీ క్యారెక్టర్ లో కాళీచరణ్ సంజయ్ మంచి నటన కనబరిచారు. గెటప్ శ్రీను, సత్య కృష్ణ పాత్రలకు ప్రాధాన్యత కనిపించింది..
టెక్నీషియన్స్ విషయానికొస్తే....
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించిన కళ్యాణ్ సమీ..సినిమాటోగ్రఫీ చెప్పుకోదగిన స్థాయిలో లేదు.స్వరాలు కూర్చిన విజయ్ బాలాజీ సంగీతం అక్కడక్కడా మెప్పించింది ఆడబిడ్డ రుధిరంతో అనే పాట హృద్యంగా సాగుతుంది. దర్శకుడు ప్రకాష్ పులిజాల కథనానికి తీసుకున్న స్ఫూర్తి బాగున్నా దాన్ని రాసుకున్న తీరు చాలా పేలవంగా ఉంది. కొద్దిగా కమర్షియల్ అంశాలని జోడించి, మంచి కథనాన్ని రాసుకుని, కొంత అనుభవం కలిగిన నటీనటుల్ని ఎంచుకుని ఉంటే బాగుండేది.
చివరగా...
‘అనగనగా ఒక దుర్గ’ సినిమా నైపథ్యం పరంగా మెచ్చుకోదగ్గదిగా ఉన్నా తీసిన విధానం, హీరోయిన్ మినహా మిగతా నటీనటుల నటన సరిగా లేకపోవడంతో ఔట్ ఫుట్ గొప్ప స్థాయిలో రాలేదు. సామాజికచైతన్యాన్ని ప్రస్తావించే సినిమాల్ని ఇష్టపడే వారికి పర్వాలేదనిపించవచ్చు.కానీ రెగ్యులర్ కమర్షియల్ ఆడియన్సుకు ఈ సినిమా నచ్చకపోవచ్చు.

ఫ్లస్ పాయింట్స్
ప్రియాంక నటన
సంగీతం

మైనస్ పాయింట్స్
పాత కథ
సినిమాటోగ్రఫీ

Don't Miss