భోగి వేడుకలు

07:26 - January 14, 2018

కడప : భోగ భాగ్యాలను ఇచ్చే భోగి వేడుకలు కడప నగరంలోని నెహ్రూపార్క్‌లో ఘనంగా నిర్వహించారు. వాకర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో భోగి వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో కుల, మతాలకు అతీతంగా ప్రజలు పాల్గొన్నారు.  తోటివారితో కలిసి ఆనందంగా పండుగ జరుపుకోవడమే అసలైన సంక్రాంతి అని నిర్వాహకులు అన్నారు. 
ఏలూరులో 
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో భోగి పండగను ఘనంగా జరుపుకుంటున్నారు. చిన్నవారి నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ భోగి మంటలు వేసి సంక్రాంతి సందడిని మొదలు పెట్టారు.  కొత్త బట్టలతో ప్రత్యేక పూజలు చేసి భోగి మంటను వెలిగించి పాటలు పాడుకుంటున్నారు... ఏలూరులో జరుగుతున్న భోగి సంబరాలపై మరింత సమాచారం వీడియోలో చూద్దాం.. 
అనంతపురంలో 
అనంతపురం జిల్లా పరిషత్‌ కార్యాల ఆవరణలో భోగీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పూల నాగరాజు భోగిమంటలను వెలిగించి వేడుకలు ప్రారంభించారు.  భోగిమంటలు వేసి దాని చుట్టూరా తిరుగుతూ సిబ్బంది, కళాకారులు ఆడిపాడుతున్నారు. సంక్రాంతి విశిష్టతను తెలుపుతూ భోగి పండుగను జరుపుకున్నారు.  భోగి మంటల చుట్టూ కూచిపూడి కళాకారులు నృత్యాలు చేస్తూ అలరించారు. 

 

Don't Miss