ఏసీబీ వలకు మరో అవినీతి చేప

18:13 - April 11, 2018

జయశంకర్‌ భూపాలపల్లి : ఏసీబీ వలకు మరో అవినీతి చేప చిక్కింది. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా ఆర్‌డీఓ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్న శ్రీనివాస్‌..... పలిక రఘునాచారి అనే రైతు వద్ద నుండి 50వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. భూపాలపల్లి శివారులో రఘునాచారికి చెందిన 320, 321 సర్వే నంబర్‌లో గల భూములను కొందరు వ్యక్తులు అక్రమంగా పట్టా చేసుకున్నారు. తమ భూమిని అక్రమంగా పట్టా చేయించుకున్నారని ఆ రైతు గతంలో ములుగు ఆర్డీవోకు అప్పీలు చేశారు.తనకు న్యాయం చేయాలని సీనియర్‌ అసిస్టెంట్‌ను కోరగా... 50వేలు లంచం అడిగారు. ఈ విషయాన్ని రైతు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయగా లంచం తీసుకునే సమయంలో అధికారులు ఆకస్మిక దాడులు చేసి పట్టుకున్నారు. శ్రీనివాస్‌ను అరెస్ట్‌ చేసి హైదరాబాద్‌లోని ఏసీబీ స్పెషల్‌ కోర్టుకు పంపుతామని అధికారులు తెలిపారు. 

 

Don't Miss