ఫిల్మ్ ఇండ్రస్ట్రీలో మరో వారసుడు ఎంట్రీ..

16:42 - June 21, 2018

సినీ పరిశ్రమ ఏదైనా వారసుల హవా మాత్రం కొనసాగుతోంది. తెలుగు, తమిళ,మలయాళం భాష ఏదైనా ఆయా సినీ పరిశ్రమలో వారసుల హవా కొనసాగుతోంది. తెలుగు పరిశ్రమలో సీనియర్ హీరోలు తమ కుమారులను హీరోలుగా రంగంలోకి దింపడమనేది చాలాకాలం నుంచి జరుగుతున్నదే. తెలుగులో చిరూ తనయుడిగా ఎంట్రీ ఇచ్చిన చరణ్ .. కృష్ణ వారసుడిగా అడుగుపెట్టిన మహేశ్ బాబు స్టార్ హీరోలుగా వెలుగుతున్నారు. ఇక మలయాళంలో మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ కూడా ఒక రేంజ్ లో దూసుకుపోతున్నాడు. తమిళంలో కార్తీక్ తనయుడు గౌతమ్ కార్తీక్ హీరోగా ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడానికి ట్రై చేస్తున్నాడు. విక్రమ్ తనయుడు 'ధృవ్' కూడా తండ్రిబాటలో నడవడానికి రెడీ అవుతున్నాడు. ఈ నేపథ్యంలో స్టార్ హీరో విజయ్ తనయుడు సంజయ్ కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. ఇటీవలే ఇంటర్మీడియెట్ పూర్తి చేసిన ఈ కుర్రాడు, కొంతకాలం పాటు ఫిల్మ్ మేకింగ్ కోర్స్ పై దృష్టి పెడతాడట. అందుకోసం త్వరలో కెనడా వెళుతున్నాడు. ఆ తరువాత నటన .. డాన్స్ .. ఫైట్స్ లో శిక్షణ పొంది ఎంట్రీ ఇస్తాడని అంటున్నారు. ఇది విజయ్ అభిమానులకు ఆనందాన్ని కలిగించే విషయమే.

Don't Miss