గజేంద్ర చౌహాన్ అవుట్..అనపమ్ ఇన్..

11:19 - October 12, 2017

ఎఫ్‌టీఐఐ (ఫిలిం అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా) నూతన ఛైర్మన్‌గా బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌ నియమితులయ్యారు. ఈ పదవిలో ఉన్న బుల్లితెర నటుడు గజేంద్ర చౌహాన్ రాజీనామా చేశారు. గజేంద్ర చౌహాన్ ను నియమించడం పట్ల ఆందోళనలు జరిగిన సంగతి తెలిసిందే. ఆ పదవికి గజేంద్ర అర్హుడు కాదని..ఎఫ్ టీఐఐ విద్యార్థులు తీవ్ర నిరసనలు..ఆందోళనలు వ్యక్తపరిచారు. కానీ రాజీనామా చేయడానికి మాత్రం గజేంద్ర ఒప్పుకోలేదు. దీనితో విద్యార్థులు కొన్ని నెలల పాటు తరగతులకు వెళ్లడానికి నిరాకరించారు. తాజాగా ఈ పదవిలో అనుపమ్ ఖేర్ నియమితులయ్యారు.

ఇక అనుపమ్ ఖేర్ విషయానికి వస్తే ఆయన దాదాపు 500 పైగా సినిమాల్లో నటించారు. ఎన్నో అవార్డులు..రివార్డులు అందుకున్న అనుపమ్ గతంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిలిం సర్టిఫికేషన్, నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలకు చైర్మన్ గా వ్యవహరించారు. కళారంగానికి ఆయన అందించిన సేవలకు గానూ భారత ప్రభుత్వం పద్మ శ్రీ, పద్మ భూషణ్ అవార్డులతో సత్కరించింది. 

Don't Miss