ఆరుషిని తల్లిదండ్రులు చంపలేదంట..

16:18 - October 12, 2017

ఢిల్లీ : ఆరుషి తల్వార్ హత్య కేసులో ఆమె తల్లిదండ్రులకు అలహాబాద్ హైకోర్టులో ఊరట లభించింది. తల్లిదండ్రులిద్దరు నిర్దోషులేనని అలహాబాద్ హైకోర్టు తీర్పు వెల్లడించింది. బెనిఫిట్ ఆఫ్ డౌట్ కింద నిర్దోషులుగా కోర్టు తేల్చింది. సంశయలాభం కింద నిర్దోషులుగా కోర్టు తేల్చింది. 2013 లో రాజేశ్ తల్వార్ దంపతులకు జీవిత ఖైదు విధించింది. తీర్పుపై తల్లిదండ్రులు అలహాబాద్ హైకోర్టుకు వెళ్లారు. ఆరుషి హత్య కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 
2008 లో ఆరుషి తల్వార్‌ హత్య 
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2008 లో ఆరుషి తల్వార్‌ హత్య గావించబడింది. ఈకేసులో గజియాబాద్‌లోని సిబిఐ ప్రత్యేక కోర్టు నవంబర్ 25, 2013 ఆరుషి తల్లిదండ్రులకు జీవిత ఖైదు విధించింది. సీబీఐ కోర్టు తీర్పును సవాలు చేస్తూ ఆరుషి తల్లిదండ్రులు రాజేష్‌ తల్వార్, ఆయన భార్య నుపూర్ తల్వార్‌ 2014లో హైకోర్టును ఆశ్రయించారు. 2008 మే 16వ తేదీన ఉత్తరప్రదేశ్ నోయిడాలోని జలవాయువిహార్‌లో సెక్టార్ 25లోని ఇంట్లోనే ఆరుషి హత్యకు గురైంది. మరుసటి రోజు పనిమనిషి హేమరాజ్ శవం టెర్రస్‌పై కనిపించింది. ఆరుషి, హేమరాజ్‌లను అభ్యంతరకరమైన దృశ్యంలో చూసిన రాజేష్‌ తల్వార్‌ వారిద్దరి హత్య చేశారు. రాజేష్‌ భార్య నుపూర్‌ ఆధారాలు లేకుండా చేశారన్న ఆరోపణలతో ఆరుషి తల్లిదండ్రులను అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం వీరిద్దరు గజియాబాద్‌లోని డాస్‌నా జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

Don't Miss