'సోలో' తో 'అతడే' వస్తున్నాడు..

12:06 - June 13, 2018

ఇటీవల 'మహానటి' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించిన దుల్కర్ సల్మాన్ 'అతడే' చిత్రంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. తమిళ, మలయాళ భాషల్లో రూపొందిన 'సోలో' చిత్రాన్ని 'అతడే' పేరిట తెలుగులోకి అనువదిస్తున్నారు. దీనిని ఈ నెల 22న రిలీజ్ చేస్తున్నారు. దుల్కర్ సల్మాన్ మలయాళ నటుడు ముమ్ముట్టి వారసుడిగా వచ్చినా..అనతికాలంలోనే తనకంటు ఓ ముద్ర వేసుకున్న యువ నటుడు. నటుడు అనే పదానికి మారుపేరుగా పేరు తెచ్చుకున్నాడు దుల్కర్. సెకండ్ షో అనే మలయాళ చిత్రంతో ఆయన తెరంగేట్రం చేసిన దల్కర్ ఈ సినిమా విజయవంతమై 100 రోజులు ఆడింది. అంతేకాదు ఈ సినిమాకి ఉత్తమ తొలిచిత్ర నటునిగా పురస్కారాన్ని పొంది, ఫిల్మ్ ఫేర్ ఉత్తమ చిత్రానికి నామినేట్ కూడా అయ్యారు.

దుల్కర్ అవార్డులు..
బాలాజీ మోహన్ దర్శకత్వం వహించిన 'వాయై మూడి పేశవుం' అనే సినిమాతో తమిళ చిత్ర పరిశ్రమలో కూడా దుల్కర్ ప్రవేశించారు. ఫిల్మ్ ఫేర్ అవార్డుల్లో ఉత్తమ తొలిచిత్ర నటుడు పురస్కారాన్ని రెండుసార్లు 2012లో సెకండ్ షో సినిమాకి మలయాళంలోనూ, 2014లో వాయై మూడి పేశవం సినిమాకి తమిళంలోనూ దుల్కర్ సల్మాన్ అందుకున్నారు. 

Don't Miss