శ్రీకాళహస్తికి వెళ్లి వస్తూ అనంతలోకాలకు...

09:27 - February 13, 2018

చిత్తూరు : జిల్లాలో ఘోరమైన దుర్ఘటన చోటు చేసుకుంది. శివాలయానికి వెళ్లి తిరిగి వస్తూ అనంతలోకాలకి వెళ్లిపోయారు. బి.ఎన్.కండ్రీగలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురుమ మృత్యువాత పడ్డారు. మయూరా షుగర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న కొంతమంది శ్రీకాళహస్తీకి వెళ్లడానికి వెళ్లారు. ఆటోలో తిరిగి వస్తున్నారు. బి.ఎన్.కండ్రీగ వద్దకు చేరుకోగానే కంకర లోడ్ తో వెళుతున్న టిప్పర్ వారు ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొంది. దీనితో ఆటోలో ఉన్న ఐదుగురు అక్కడికక్కడనే మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న కుటుంబసభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. 

Don't Miss