'బాబు బాగా బిజీ' రిలీజ్ కు రెడీ

11:33 - December 24, 2016

తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు అవసరాల శ్రీనివాస్. కేవలం నటుడుగానే కాకుండా సినిమాలకు కథా మాటలు కూడా అందించే సత్తా ఉన్న నటుడు అవసరాల. ఊహలు గుసగుసలాడే చిత్రంతో మంచి బ్రేక్ కూడా సాధించాడు. కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద సినిమాలతో దర్శకుడిగా కూడా మంచి విజయాలు సాధించాడు. ఇటీవల విడుదలైన జెంటిల్ మన్ సినిమాతో విలన్ గానూ మంచి మార్కులు సాధించాడు. ప్రస్తుతం అవసరాల శ్రీనివాస్ హీరోగా తెరకెక్కుతున్న 'బాబు బాగా బిజీ' రిలీజ్ కు రెడీ అవుతోంది.

బాలీవుడ్ అడల్డ్ కామెడీ హంటర్రర్ తెలుగు రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సెక్స్ అడిక్ట్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో చాలా వేరియేషన్స్ వున్నాయి.చాలా ఎమోషన్స్ ఉన్నాయని...అందుకే చేస్తున్నా అంటూ చెప్పుకొచ్చాడు అవసరాల.ఇది కేవం అడల్ట్ కామెడీ సినిమాగానే చూస్తున్నారు అందరూ,నావరకైతే స్టోరీ, నా కేరెక్టర్ కు లోతైన అర్థం ఉందని నేను భావిస్తున్న అందుకే ఈ సినిమాకు అంగీకరించా అంటున్నాడు అవసరాల. తాజాగా విజయ్ అనే కొత్త దర్శకుడి సినిమాలో హీరోగా నటించేందుకు ఓకె చెప్పాడు. బాబు బాగా బిజీ రిలీజ్ తరువాత దర్శకుడిగా నానితో సినిమా చేసే ప్లాన్ లో ఉన్నాడు. ఆ సినిమా పూర్తయిన తరువాత., తను హీరోగా విజయ్ తెరకెక్కించే సినిమాకు డేట్స్ అడ్జస్ట్ చేసే పనిలో ఉన్నట్లు టాలీవుడ్ టాక్..

Don't Miss