'అవసరాల' కొత్త అవతారం..

12:36 - March 28, 2017

'ఊహలు గుసగుసలాడే' కంప్లీట్ హెల్తీ కామెడీతో నడిచే లవ్ స్టోరీ. 'అవసరాల శ్రీనివాస్' డైరెక్టర్ గా వచ్చిన ఈ సినిమా ఒక ఊపు ఊపింది. చిన్న సినిమాల ఒరవడిలో బెస్ట్ హిట్ అందుకున్న సినిమా కూడా ఇదే. స్వచ్ఛమైన కామెడీతో ఎక్కడా డబుల్ మీనింగ్ మాటలకి ప్లేస్ ఇవ్వకుండా మంచి లవ్ స్టోరీని అందించాడు అవసరాల. 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో తెలుగు తెరకు నాగశౌర్య, రాశిఖన్నా ఇద్దరూ కొత్తవారు పరిచయం అయ్యారు. డైరెక్టర్ గానే కాకుండా నటుడిగా కూడా మంచి నేమ్ వచ్చింది అవసరాలకి. హిందీ లో హిట్ టాక్ తో వచ్చిన 'హంటర్' అనే సినిమాని మక్కికి మక్కి తెలుగులో దింపేసాడు నవీన్ మేడారం. కొత్త టాలెంట్ ని ఎంకరేజ్ చేస్తున్నా అని ప్రకటించిన అభిషేక్ నామ ఈ సినిమాకి ప్రొడ్యూసర్. 'హంటర్' సినిమాని తెలుగు రీమేక్ 'బాబు బాగా బిజీ' అనే టైటిల్ తో తీసుకురాబోతున్న ఈ ప్రయత్నంలో మసాలా కొంచెం గట్టిగానే వేశారు అనే చెప్పాలి. ఒరిజినల్ హంటర్ లో ఉండే మసాలా ఈ తెలుగు 'బాబు బాగా బిజీ'లో కూడా దింపేశారు డైరెక్టర్. ఈ సినిమాలో 'అవసరాల శ్రీనివాస్' హీరోగా నటిస్తున్నాడు. ఇటీవల రిలీజ్ ఐన ట్రైలర్ 'అవసరాల' లుక్ ని కంప్లీట్ గా మార్చేసింది. అసలు 'అవసరాల' ఏంటి ఇలా నటించడం ఏంటి అని ముక్కున వేలేసుకున్నారు ఆడియన్స్. ఏది ఏమైనా ట్రైలర్ లోనే మసాలా వాసనలు భయంకరంగా ఉన్నాయని 'అవసరాల' ఫామిలీ ఆడియన్స్ వర్గం అనుకుంటున్నారు.

Don't Miss