ఉత్తమ నియోజకవర్గంగా పెద్దపెల్లి: కేసీఆర్

16:54 - December 29, 2016

హైదరాబాద్ : ఆదర్శంగా మొక్కలు పెంచుతున్న వారికి పారితోషికం అందిస్తున్నట్లు సీఎం కేసీఆర్‌ చెప్పారు. హరితహారంపై చర్చలో భాగంగా శాసనసభలో ఆయన అవార్డులు ప్రకటించారు. ఉత్తమ నియోజకవర్గంగా పెద్దపెల్లి ఎంపికైనట్లు చెప్పారు. ఉత్తమ మున్సిపాలిటిగా సిద్ధిపేటను కేసీఆర్‌ ప్రకటించారు. ఉత్తమ గ్రామం, జిల్లా, సర్పంచ్‌, ఉపాధ్యాయుడు అవార్డులను సీఎం ప్రకటించారు.

మొక్కలు పెంచుతున్న స్కూల్‌ విద్యార్ధులకు ప్రతి నెల 5 రూపాయలు: కేసీఆర్
మొక్కలు పెంచుతున్న స్కూల్‌ విద్యార్ధులకు ప్రతి నెల 5 రూపాయలు ఇస్తున్నట్లు తెలంగాణ సీఎం కేసీఆర్‌ చెప్పారు. హరితహారంపై తెలంగాణ అసెంబ్లీలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. ఇప్పటికే 8 కోట్ల టేకు మొక్కలు పంపిణీ చేసినట్లు ఆయన చెప్పారు. వచ్చే ఏడాది 15 కోట్ల టేకు మొక్కలు సరఫరా చేయనున్నట్లు కేసీఆర్‌ చెప్పారు. మంత్రి జోగురామన్న ఆధ్వర్యంలో హరితహారం కమిటీలు ఏర్పాటు చేసినట్లు కేసీఆర్‌ వెల్లడించారు. 

Don't Miss