హెచ్‌సీఏలో అక్రమాలపై విచారణ జరిపించాలి : అజారుద్దీన్‌

13:57 - January 13, 2018

హైదరాబాద్ : హైదరాబాద్‌ క్రికిట్‌ అసోసియేషన్‌పై  టీమిండియా మాజీ కెప్టెన్‌ అజారుద్దీన్‌ ఫైర్‌ అయ్యారు. తనను హెచ్‌సీఏ ఎన్నికల్లో పాల్గొనకుండా అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని తేలిందన్నారు. ఈమేరకు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. లోధాకమిటీ సిఫార్స్‌లను పరిగణలోనికి తీసుకోలేదని అజహార్‌ విమర్శించారు. హెచ్‌సీఏ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని దీనిపై తాను  న్యాయపోరాటానికి రెడీ అవుతున్నట్టు అజారుద్దీన్‌ స్పష్టం చేశారు. 

 

Don't Miss