బీజేపీ మరో చిచ్చు : హనుమంతుడిని రాజకీయాల్లోకి లాగారు

12:50 - December 5, 2018

ఉత్తర్ ప్రదేశ్ : హనుమంతుడు..దళితుడు.. కాదు కాదు..గిరిజనుడు...అసలే కాదు..ఆయన జైనుడు అంటూ పలువురు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. కులమతలాపై జోరుగా చర్చ జరుగుతోంది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ రాజస్థాన్‌ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ...హనుమంతుడు దళితుడని చెప్పుకొచ్చారు. సీఎం యోగి వ్యాఖ్యలపై.. సొంత పార్టీ ఎంపీ సావిత్రి బాయిపూలే కౌంటర్ ఇచ్చారు. హనుమంతుడు కూడా మనిషి.. ఆయన కోతి కాదని.. దళితుడైనందుకు అవమానాన్ని ఎదుర్కొన్నారని తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఆయన్ను మనువాదులకు బానిసగా మార్చేశారు.. రాముడి కోసం ఆయన ఎంతో చేశారన్నారు. చివరికి హనుమంతుడికి ఓ తోకను తగిలించి ముఖానికి మసిపూసి కోతిగా ఎందుకు చిత్రీకరించారు అంటూ ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో లబ్ది పొందేందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటూ యోగిపై చిందులేశారాయె. హనుమంతుడు దళితుడు అయితే.. హనుమాన్ ఆలయాల్లో దళిత పూజారీలను నియమించాలి కదా అని నిలదీశారు.

Don't Miss