ఎది నిజం...?

21:35 - February 13, 2018

విజయవాడ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐక్యంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలను మోసం చేస్తున్నాయని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. విభజన హామీలను అమలు చేయకుండా తప్పుడు లెక్కలతో ప్రజలను మభ్యపెడుతున్నాయని విమర్శించారు. కేంద్రంలో బీజేపీతో టీడీపీ లాలూచీ పడిందని మధు ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా అంటూ టీడీపీ-బీజేపీలు ఎన్నికల స్టంట్‌కు తెరతీశాయని మండిపడ్డారు.

ఏపీకి చాలా నిధులు
మరోవైపు అధికార పార్టీ తీరుపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు మరోసారి మండిపడ్డారు. విభజన హామీలు, బడ్జెట్‌లో నిధుల కేటాయింపులపై టీడీపీ చేస్తున్న ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. ఇప్పటి వరకు కేంద్రం ఇచ్చిన నిధులను ఎలా వినియోగించారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలని డిమాండ్‌ చేశారు. 2017 బడ్జెట్‌ తర్వాత ఏపీకి చాలా నిధులు ఇచ్చారని కేంద్రాన్ని మెచ్చుకున్న చంద్రబాబు.. ఇప్పుడు అసలు నిధులే ఇవ్వలేదన్నట్టుగా మాట్ల్లాడుతన్నారని బీజేపీ ఎమ్మెల్సీ నిలదీశారు. అసలు విభజన చట్టంలోని హామీలు నెరవేర్చేందుకు 2022 వరకు

అటు అరకు ఎంపీ కొత్తపల్లి గీత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరని తప్పుపట్టారు. అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఏ మేరకు నిధులు ఇస్తానందో రాష్ట్రప్రభుత్వం చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. అమరావతి నిర్మాణానికి లక్ష కోట్ల నిధులు ఇవ్వాలని గతంలో కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు చెప్పిన విషయాన్ని ఎంపీ గీత గుర్తుచేశారు.

వామపక్షపార్టీలు, ప్రజాసంఘాలతో భేటీ
ఒకరు ఇచ్చామంటారు.. మరొకరు ఇవ్వలేదంటారు.. అసలు వారు ఎంత ఇచ్చారో..వీరు ఎంత తీసుకున్నారో లెక్కలు తేలాల్సిందే అంటున్నారు సీపీఎం నేతలు. ఏపీకి జరిగిన అన్యాయంపై పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు ప్రకటించారు. దీనికోసం ఈనెల 14న విజయవాడలో 10 వామపక్షపార్టీలు, ప్రజాసంఘాలతో భేటీ నిర్వహిస్తున్నామని.. అనంతరం ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామంటున్నారు. అటు జనసేనపార్టీ చేస్తున్న జేఏసీ ప్రయత్నాలను కూడా తాము స్వాగతిస్తున్నామని సీపీఎం నేతలు ప్రకటించారు. ప్రజలను మోసం చేయడంలో బీజీపీ, టీడీపీలు ఒకదాన్ని మించి మరొకటి పోటీపడుతున్నాయని వామపక్షాలు, ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. ఏపీ ప్రయోజనాలను కాపాడేందుకు ప్రజలను కదిలించి పెద్దఎత్తున ఉద్యమిస్తామని లెఫ్ట్‌పార్టీలు తేల్చి చెబుతున్నాయి. 

Don't Miss