చెన్నమనేని శాసనసభ్యత్వానికి రాజీనామా చేయాలి : ఆది శ్రీనివాస్

22:04 - September 7, 2017

ఢిల్లీ : చెన్నమనేని రమేష్‌ తప్పుడు పత్రాలతో భారతదేశ పౌరసత్వం పొందడం సిగ్గుచేటని బిజెపి నేత ఆది శ్రీనివాస్ విమర్శించారు. చట్టాన్ని మోసగిస్తూ ఆయన చట్టసభలో అడుగుపెట్టారని ఆరోపించారు. చెన్నమనేని పౌరసత్వాన్ని రద్దు చేస్తూ కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ ముఖేష్ మిట్టల్ ఉత్తర్వులు ఇచ్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. చెన్నమనేని వెంటనే తన పదవికి రాజీనామా చేయాలన్నారు ఆది శ్రీనివాస్ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

 

Don't Miss