సోము వీర్రాజు విభజన లెక్కలు...

11:21 - February 13, 2018

విజయవాడ : విభజన హామీల రగడ ఇంకా కొనసాగుతోంది. టిడిపి..బిజెపి నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కేంద్రం అధికంగానే నిధులు ఇచ్చిందని బిజెపి పేర్కొంటుండగా అంతగా నిధులు ఇవ్వలేదని టిడిపి పేర్కొంటోంది. ఈ నేపథ్యంలో మంగళవారం బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు మీడియాతో విభజన హామీల వివరాలు..కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలు వెల్లడించారు.

రాజకీయ దుమారానికి తమ పార్టీ అధ్యక్షుడు తెరదించే ప్రయత్నం చేశారని, ఐదేళ్లు అని బిల్లులో ఎందుకు పెట్టలేదని కాంగ్రెస్ ను నిలదీయాలని పిలుపునిచ్చారు. 2022 దాక హామీలు నెరవేర్చడానికి సమయం ఉందన్నారు. ఏపీకి కేంద్రం ఎక్కువగానే ఇచ్చిందని..సంతృప్తిగానే ఉన్నామని..కేంద్రం అన్ని ఇచ్చిందని స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు..కేంద్ర మంత్రి సుజనా చౌదరి అనేకసార్లు చెప్పారని గుర్తు చేశారు. ప్రత్యేక ప్యాకేజీపై సీఎం బాబు మాటమారుస్తున్నారని ఆరోపించారు. ఏపీకి ఇనిస్టిట్యూట్ వంద శాతం ఇచ్చారని, అదనంగా 8 ఇనిస్టిట్యూట్స్ ఇచ్చారని తెలిపారు. ఇందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి గంటా శ్రీణివాసరావు తెలియచేశారని తెలిపారు. నిట్ కు ప్రారంభంలో వంద సీట్లు మాత్రమే ఇస్తారని, కానీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీని ప్రత్యేకంగా కోరడంతో నాలుగు వంద సీట్లు తెచ్చుకోవడం జరిగిందన్నారు. క్లాసులు ప్రారంభమయ్యాయని, కేంద్రం యొక్క మేనేజ్ మెంట్ తో ఇనిస్టిట్యూట్ జరుగుతాయన్నారు. ఇక బిల్లులో రాజధాని అంశం కూడా పేర్కొనడం జరిగిందని...రాజ్ భవన్, సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు భవనాలు కట్టాలని బిల్లులో పొందుపర్చడం జరిగిందన్నారు. 

Don't Miss