ఏపీ రాష్ట్రానికి కేంద్రం ఏమిచ్చిందంటే...

15:08 - February 10, 2018

ఢిల్లీ : ఏపీకి కేంద్రం సహాయం చేయడం లేదని...విభజన హామీలు అమలు చేయాలంటూ టిడిపి ఎంపీలు, ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నారు. ఏ రాష్ట్రానికి చేయని సహాయం కేంద్రం చేసిందని బిజెపి పేర్కొంటోంది. ఇటీవలే ప్రవేశ పెట్టిన కేంద్ర బడ్జెట్ లో ఏపీ రాష్ట్రాన్ని పట్టించుకోలేదని టిడిపి ఎంపీలు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి కేంద్రం ఏమి ఇచ్చిందో పేర్కొటూ 27పేజీలతో కూడిన నివేదికను శనివారం బిజెపి ఏపీ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు విడుదల చేశారు.

ఈ సందర్భంగా కంభంపాటితో టెన్ టివి మాట్లాడింది. తాను విడుదల చేసిన నివేదికలో ఏ అంశమైనా తప్పుంటే చెప్పాలని సూచించారు. ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారని, రూపాయి నష్టం లేకుండా కేంద్రం చేస్తోందన్నారు. పోలవరం నిర్మాణ బాధ్యతను కేంద్రం తీసుకొంటుందని కంభంపాటి స్పష్టం చేశారు. 

Don't Miss