ఏపీకి సాయం...27 పేజీల నోట్...

14:16 - February 10, 2018

ఢిల్లీ : ఏపీకి కేంద్రం సహాయం చేయడం లేదని...విభజన హామీలు అమలు చేయాలంటూ గత కొన్ని రోజులుగా ఏపీ టిడిపి ఎంపీలు పార్లమెంట్ లో ఆందోళన చేపడుతున్న సంగతి తెలిసిందే. దీనితో కేంద్రం పలు చర్యలకు ఉపక్రమించింది. అందులో భాగంగా ఏపీకి ఎంత సహాయం చేశామో పేర్కొంటూ బిజెపి అధ్యక్షుడు కంభంపాటి 27 పేజీల నోట్ ను విడుదల చేశారు. అందులో ఎలాంటి సహాయం చేశామో...ఎంత నిధులు విడుదల చేశామో పేర్కొన్నారు.

ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టం అమలుకు కేంద్రం కట్టుబడి ఉందన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉందని..ఇప్పటికే రూ. 4వేల కోట్లు కేటాయించారని తెలిపారు. పోలవరం ఏడు ముంపు గ్రామాలను ఏపీలో కలుపుతూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కేబినెట్ లో నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. విశాఖ రైల్వే జోన్ కోసం కమిటీ వేశారని, త్వరలో ఈ సమస్య తీరుతుందన్నారు. దుగ్గరాజు పట్నం పోర్టు ఏర్పాటుకు ఇస్రో వ్యతిరేకిస్తోందని చెప్పుకొచ్చారు. ఏపీలో రోడ్ల నిర్మాణానికి రూ. లక్ష కోట్లు కేటాయించిందని తెలిపారు. 

Don't Miss