బాహుబలి 2 ట్రైలర్‌ రిలీజ్‌

22:10 - March 16, 2017

దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోన్న బాహుబలి -2 ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యింది.   హైదరాబాద్‌లోని సినిమ్యాక్స్‌లో బాహుబలి 2 తెలుగు వర్షన్‌ ట్రైలర్‌ను దర్శకుడు రాజమౌళి విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి హీరో ప్రభాస్‌, రానా, హీరోయిన్‌ తమన్న ,  దర్శకులు రాఘవేంద్రరావు హాజరయ్యారు. రెండు నిమిషాల 20 సెకన్ల నిడివిగల ట్రైలర్‌ దుమ్మురేపుతోంది. అయితే ట్రైలర్‌లో  ఫస్ట్‌పార్ట్‌లోని కొన్ని సీన్స్‌ రిపీట్‌ అయ్యాయి. కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపినట్టు అన్న కోణాన్ని బయటపెట్టకుండా రాజమౌళి సస్పెన్స్‌లో పెట్టేశాడు.  ఆధిపత్య పోరులో అన్నదమ్ముల మధ్యవార్‌ సన్నివేశాలు మేజర్‌ హైలెట్‌గా చూపించారు.  బాహుబలి-2 ది కన్లూజన్‌ చిత్రాన్ని వచ్చే నెల ఏప్రిల్‌ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. మరోవైపు ట్ర్రైలర్ విడుదలైన 12గంటల్లోనే కోటి 60లక్షల వ్యూస్‌తో.. కొత్త రికార్డ్ సృష్టించింది. 

 

Don't Miss