తెలుగు పాలిటిక్స్‌లో 'బాహుబలి'

12:10 - March 19, 2017

హైదరాబాద్ : అసెంబ్లీ ఆవ‌ర‌ణ‌లో ఎవ‌రి నోట విన్నా అదే మాట‌... బాహుబలి క్యారెక్టర్లు ఇప్పుడు తెలుగు రాజకీయాల్లోకివచ్చేశాయి.. జానారెడ్డి మొదలుపెట్టిన బాహుబ‌లి  కామెంట్స్.. పొలిటిక‌ల్ స్క్రీన్ ను హీటెక్కిస్తున్నాయి. 
తెలుగు పాలిటిక్స్‌నూ షేక్‌ చేస్తున్న బాహుబలి 
బాహుబలి సినీరంగాన్నేకాదు... తెలుగు పాలిటిక్స్‌నూ షేక్‌ చేస్తోంది... అసెంబ్లీలో.... బయటా ఎక్కడచూసినా బాహుబలిని పోలుస్తూ నేతలు సెటైర్లు విసురుతున్నారు.. ముఖ్యంగా బాహుబలి వస్తాడంటూ ప్రతిపక్ష నేత జానా వ్యాఖ్యల తర్వాత కామెంట్లు మరింత ఊపందుకున్నాయి. జానా మాటలపై అధికార, ప్రతిపక్ష సభ్యులు పోటీపడిమరీ చర్చించుకుంటున్నారు.
కాంగ్రెస్ లో బాహుబలిపై ఆసక్తికరంగా చర్చ 
కాంగ్రెస్‌లో బాహుబ‌లి ఎవ‌రంటూ టీఆర్‌ఎస్‌ నేతలు కాంగ్‌ లీడర్లను ప్రశ్నిస్తుండగా... హస్తం పార్టీలో బాహుబలిపై మరింత ఆసక్తికరంగా చర్చ నడుస్తోంది.. కాంగ్రెస్‌లో చాలామంది బాహుబలులున్నా... జానారెడ్డి మా బాహుబలి అంటూ తేల్చేస్తున్నారు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి.
ఎన్నిక‌ల నాటికి బాహుబ‌లి రావ‌డం ఖాయం : డికే
అటు బాహుబలి ఎపిసోడ్‌పై తన స్టైల్‌లో స్పందించారు డీకే అరుణ... ఎన్నిక‌ల నాటికి బాహుబ‌లి రావ‌డం ఖాయ‌మ‌న్న డికే.... సీఎం కేసీఆర్‌ను కట్టప్పతో పోల్చారు.... మరో ఎమ్మెల్యే సంపత్‌ కుమార్‌... తెలంగాణకు తానే బాహుబలినంటూ ప్రకటిస్తున్నారు.. 
కేసీఆర్‌ ను బల్లాలదేవుడితో పోలిక
బాహుబలి ఎవరో చెబుతూనే కాంగ్‌ నేతలు... మూవీలోని మిగతా పాత్రలనూ వాడేసుకుంటున్నారు.. కేసీఆర్‌ను బల్లాలదేవుడితో పోల్చిన భట్టి విక్రమార్క... బాహుబలి సెకండాఫ్‌లో కాంగ్రెస్‌దే విక్టరీ అని స్పష్టం చేస్తున్నారు.. ఇక రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ బాహుబలి తడాఖాఏంటో చూపిస్తామంటూ సవాల్‌ విసురుతున్నారు జీవన్‌ రెడ్డి.. మొత్తానికి జానారెడ్డి పేల్చిన బాహుబ‌లి ఎపిసోడ్‌ లీడర్ల మధ్య హాట్‌ టాపిక్‌గా మారింది.

 

Don't Miss