బాబ్రీ కేసులో బీజేపీ నేతలకు బెయిల్

16:42 - May 30, 2017

లక్నో : బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో బీజేపీ అగ్రనేతలకు ఊరట కలిగింది. ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్‌ జోషి, ఉమాభారతి సహా 12 మందికి సిబిఐ ప్రత్యేక కోర్టు బెయిలు మంజూరు చేసింది. 20 వేల వ్యక్తిగత పూచి కింద వీరికి బెయిలు మంజూరు అయింది. ఈ కేసులో అభియోగాల నమోదుకు నిందితుల నుంచి సంతకాలు తీసుకున్నారు. ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టు వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో అద్వాని సహా బిజెపి అగ్రనేతలపై కేసును పునరుద్ధరించాలన్న సిబిఐ వాదనను సుప్రీంకోర్టు అంగీకరించిన విషయం తెలిసిందే. దీంతో పాటు లక్నో కోర్టులోనూ రోజువారీ విచారణ చేపట్టాలని కోర్టు ఆదేశించింది. ఇందులో భాగంగా సిబిఐ ప్రత్యేక కోర్టు అద్వాని సహా సీనియర్‌ నేతలపై విచారణ జరిపింది. 

Don't Miss