'భజరంగ్ 'కార్మికులు 'ఆకలి దీక్ష'.. ఆందోళన

12:48 - January 9, 2017

గుంటూరు :మూతబడిన భజరంగ్‌ జూట్‌ మిల్లును తెరిపించాలంటూ గుంటూరు కలెక్టరేట్‌ముందు కార్మికులు, ప్రజాసంఘాలు ఆందోళనకు దిగాయి.. 'ఆకలిదీక్ష' పేరుతో నిరసన చేపట్టాయి.. జూట్‌మిల్లును తెరిపించి సీఎం తన హామీని నిలబెట్టుకోవాలని కార్మికులు డిమాండ్ చేశాయి... 18నెలలుగా మిల్లును మూసివేసిన యాజమాన్యంపై కఠిన చర్యలుతీసుకోవాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ... సీఎం చంద్రబాబు నాయుగు గతంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని, ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణితోనే పరిశ్రమ మూతపడిందని ఆరోపించారు. మేనేజ్ మెంట్ కు అనుకూలంగా చంద్రబాబు వ్యవహరించడం దారుణమన్నారు. ప్రభుత్వం దిగి వచ్చే వరకు కార్మికులకు మద్దతు ఉంటామని న్యాయవాదులు స్పష్టం చేశారు.

Don't Miss