క్లీనింగ్ కు బేకింగ్ సోడా...

12:48 - May 16, 2017

బేకింగ్ సోడా..కేవలం వంటల్లో మాత్రం ఉపయోగిస్తారా ? క్లీనింగ్ కూడా ఉపయోగించుకోవచ్చు. వంటింట్లో మరకలు..జిడ్డు మరకలు..ఇతరత్రా సమస్యలు దూరం చేసుకోవడానికి దీనిని ఉపయోగించుకోవచ్చు. మరి బేకింగ్ సోడాను ఎక్కడ ? ఎలా ? ఉపయోగించుకోవచ్చో చదవండి...

  • ఇల్లు కడిగిన తరువాత కూడా శుభ్రంగా అనిపించడం లేదా ? మళ్లీ ఓ సారి ఓ బకెట్ నీటిలో నాలుగు కప్పుల బేకింగ్ సోడాను వేసి కలపండి. శుభ్రమైన క్లాత్ తో గాని స్పాంజ్ తో తుడిస్తే సరి.
  • వంట గదిలో ఎక్కువగా చీమల సమస్య అధికంగా ఉంటుంది. చీమలు ఎక్కడ ఉంటే అక్కడ ఒక లైన్ గీయాలి. దాని వెంట బేకింగ్ సోడా వేసి చూడండి.
  • బాత్ రూమ్..కిచెన్ మూలలు శుభ్రంగా ఉంచడానికి కూడా ఉపయోగపడుతుంది. ఒక కప్పు బేకింగ్ సోడాలో సగం కప్పు వెనిగిర్ ను వేసి కలిపి పది నిమిషాలు అలాగే ఉంచాలి. ఓ శుభ్రమైన క్లాత్ తీసుకుని అందులో ముంచి దుమ్ము ఉన్న ప్రాంతాన్ని శుభ్రంగా తుడిచి తేడాను గమనించండి.
  • ఇక కిటికీ అద్దాలను..కిటికీలను కూడా శుభ్రం చేసుకోవచ్చు. స్పాట్‌లెస్‌ స్ప్రే, లేదా పొడి వెనిగర్‌లో బేకింగ్‌ సోడాను కలిపి పేస్టులా తయారు చేసుకుని అద్దాలపై గట్టిగా రుద్దాలి. ఆ తరువాత నీటితో శుభ్రంగా కడిగితే ఎంతో కొత్తవిగా కనిపిస్తాయి.
  • కంటెనర్లు..ప్లాస్టిక్ బాటిళ్లను కడిగే ముందు అందులో ఒక గ్లాసు నీరు..ఒక చెంచా బేకింగ్ సోడాను వేసి శుభ్రంగా కడుక్కోవాలి.
  • వంటగదిలో సింక్‌ను శుభ్రం చేసే ముందు సింక్‌లో కొంచెం పొడి బేకింగ్‌ సోడాను చల్లి 15-20 నిమిషాల తరువాత శుభ్రంగా నీటితో కడిగితే మంచిది. సింక్‌లో ఉండే జిడ్డు మరకలు, దుర్వాసన, బ్యాక్టీరియ వంటివి తొలగిపోతాయి.

Don't Miss