మహా ధర్నా చేపట్టిన 'బాలకృష్ణ'..

10:50 - November 12, 2017

ప్రముఖ సినీ నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణ మహా ధర్నా చేపట్టడం ఏంటీ ? అధికారం పక్షం నుండి ఎన్నికై ధర్నా చేపట్టడం ఏంటీ ? అని ఆలోచిస్తున్నారా ? అయితే ఇదేమి నిజం కాదు...కేవలం షూటింగ్ నిమిత్తం ధర్నా చేపట్టారు. వందో చిత్రం అనంతరం బాలయ్య వరుస సినిమాలకు సైన్ చేస్తున్న సంగతి తెలిసిందే. 102వ సినిమా కె.ఎస్.రవి దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్నారు. బాలయ్య సరసన నయనతార, నాటాషా జోషి, హరిప్రియలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమాకు 'జై సింహ' అనే టైటిల్ ను ఖరారు చేశారు.

చిత్ర షూటింగ్ ప్రారంభం కూడా అయ్యింది. షరవేగంగా జరుపుకొంటున్న ఈ షూటింగ్ ఇటీవలే విశాఖ బీచ్ రోడ్డులో చేశారు. సినిమాలో ఓ సన్నివేశం కోసం బీచ్‌ రోడ్డులో ఐదు వేల మంది జూనియర్‌ ఆర్టిస్టులు, 110 బస్సులతో మహాధర్నా చేశారు. అంతేగాకుండా బాలయ్య..నయన్ లపై ఓ సాంగ్ కూడా చిత్రీకరించారు. అరకు..బీచ్ లో హరిప్రియపై రొమాంటిక్ గీతాన్ని కూడా షూట్ చేశారు. మొత్తానికి వైజాగ్ లో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకుంది.
త్వరలో మరో షెడ్యూల్‌కి సన్నద్ధమవుతోందని నిర్మాత కళ్యాణ్‌ పేర్కొన్నారు. యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌గా రూపొందుతోంది. 

Don't Miss