బాలకృష్ణ ఫ్యాన్స్ కోలాహలం...
హైదరాబాద్ : నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. బాలయ్య కెరీర్లో ఇది వందో చిత్రం కావడం.. భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించిన శాతకర్ణి కథాంశంతో రూపొందడంతో గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాపై అటు అభిమానుల్లోను, ఇటు సినివర్గాల్లోను అమితాశక్తి నెలకొంది. ఈ చిత్రం ప్రత్యేక షోను బాలకృష్ణ దర్శకుడు క్రిష్‌తో కలిసి హైదరాబాద్ కూకట్‌పల్లిలోని భ్రమరాంభ థియేటర్లో వీక్షించారు. మరో వైపు బాలయ్య అభిమానులు థియేటర్ల దగ్గర సందడి చేస్తున్నారు.
విశాఖలో
విశాఖలో బాలకృష్ణ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు... బాలయ్య అదిరిపోయే సినిమాతో వచ్చాడంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.. శాతకర్ణి అపూర్వ విజయం సాధిస్తుందని ధీమాగా చెబుతున్నారు..
శాంతి థియేటర్
హైదరాబాద్‌లోని శాంతి థియేటర్ దగ్గర అభిమానులు సందడి చేశారు.