చిన్నారుల ఆటపాటలు చూడండి...

08:28 - November 11, 2017

ఖమ్మం : బాలోత్సవం.. ఖమ్మంలో ఆనందాన్ని నింపుతోంది. చిన్నారుల ఆటపాటలతో నగరం మార్మోగిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా తరలి వచ్చిన విద్యార్థులు ఉత్సవాన్ని తెగ ఎంజాయ్‌ చేస్తున్నారు. ఖమ్మం పట్టణంలోని భక్త రామదాస్ కళక్షేత్రంలో నిర్వహించిన రాష్ట్ర స్ధాయి బాలోత్సవ కార్యక్రమం రెండో రోజు.. విధ్యార్దుల్లో మరింత జోష్ నింపింది. రాష్ట్రంలోని 8 జిల్లాల నుంచి బాలలు వేల సంఖ్యలో తరలి వచ్చారు. పిల్లలతోపాటు పెద్దలు కూడా ఈ వేడుకలకు తరలివచ్చారు. ఆటపాలతో బాలోత్సవం కాస్తా ఆనోదోత్సాహంగా మారింది.

ప్రస్తుత విద్యావ్యవస్థలో చిన్నారులు సృజనాత్మకతను మరిచి పోతున్నారు. కల్చరల్ యాక్టీవిటిలేక మన సంప్రదాయాలను మరిచి పోతున్నారు. అందుకే మన కల్చర్‌గురించి చిన్నారులకు తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే ఈ బాలోత్సవ్‌ ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. ఉమ్మడిజిల్లా విడిపోయిన తర్వాత తర్వాత మొదటిసారిగా ఖమ్మంలో బాలోత్సవం నిర్వహించడం ఆనందంగా ఉందంటున్నారు. నిద్రలేచింది మొదలు .. స్టడి పేరుతో స్కూల్ ,ఇల్లు, ట్యూషన్లతో బిజిబిజిగా వుండే పిల్లలు ఈ బాలోత్సవ్‌లో పాల్గొని కేరింతలు కొడుతున్నారు. కొత్త ఫ్రెండ్స్‌తో కలిసి ఆటపాటలను ఎంజాయ్‌ చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా తరలివచ్చిన చిన్నారులు, తల్లిదండ్రులతో ఖమ్మంలో సందడి వాతావరణం నెలకొంది. బాలోత్సవ్‌లాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని విద్యార్థులు కోరుతున్నారు. 

Don't Miss