పంజాబ్‌పై బెంగళూరు విజయం

08:33 - May 15, 2018

‌‌‌హైదరాబాద్ : ఐపీఎల్‌లో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. పంజాబ్‌ నిర్దేశించిన 89 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని బెంగళూర్‌ 8.1 ఓవర్లలో వికెట్‌ కోల్పోకుండా ఛేదించింది. రాయల్‌ ఛాలెంజర్స్‌ ఓపెనర్లు విరాట్‌ కోహ్లి, పార్థీవ్‌ పటేల్‌ వికెట్‌ పడకుండా జట్టుకు విజయాన్ని అందించారు. టాస్‌ ఓడి బ్యాటింగ్‌ దిగిన కింగ్స్‌ పంజాబ్‌ 15.1 ఓవర్లలో 88 పరుగులకే అలౌటైంది. ఆర్సీబీ పేసర్‌ ఉమేశ్‌ యాదవ్‌ మూడు వికెట్లు సాధించి.. పంజాబ్‌ను దెబ్బ తీశాడు. ఒకే ఓవర్లో రాహుల్‌, క్రిస్‌ గేల్‌లను జౌట్‌ చేసి పంజాబ్‌ను కష్టాల్లోకి నెట్టాడు. బెంగళూర్‌ విజయంలో కీలక పాత్ర పోషించిన పేసర్‌ ఉమేష్‌ యాదవ్‌కు మ్యాన్‌ ఆఫ్ ది మ్యాచ్‌ అవార్డ్‌ దక్కింది.

 

Don't Miss